తెలంగాణ పీసీసీకి కొత్త హంగులు రాబోతున్నాయా? పూర్తి స్థాయి కమిటీ నియామకం కోసం కసరత్తు దాదాపు పూర్తి కావచ్చిందా? వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కూడా పిక్చర్ క్లియరైందా?
ఆపోస్ట్‌తోనే మహిళా కోటాను కూడా భర్తీ చేయాలన్న ప్లాన్ ఉందా…? అలాగైతే రేస్‌లో వినిపిస్తున్న పేరేంటి? ఆ నాయకురాలి విషయంలో ఉన్న లెక్కలేంటి? తెలంగాణ PCC చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకుని ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ.. ఇంతవరకు పూర్తి స్థాయిలో కమిటీ వేసుకోలేక పోయారు. ఆ విషయంలో ఆయనకే ఆసక్తి లేదో.. లేక ఆ స్వేచ్ఛ ఇవ్వలేదోగానీ… Pcc కమిటీలో కార్యదర్శుల నియామకం లేదు. అధికార ప్రతినిధుల పట్టింపు అంతకంటే లేదు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్స్ సంగతి సరేసరి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా కీలకం. కానీ… గడిచిన ఏడాదిన్నరలో ఆ పోస్టుల్ని భర్తీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో… త్వరలోనే ఆ నియామకం దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం Pcc చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్‌రెడ్డి… పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్నారట. ఇటీవల కొన్ని పదవుల్ని అర్హులకు ఇవ్వగా….. మిగిలిన నామినేటెడ్ పోస్ట్‌లతో పాటు పార్టీ పదవుల్ని కూడా భర్తీ చేయబోతున్నారు. ఆ క్రమంలోనే… పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

