Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్‌ డేట్‌ ప్రకటించరా?

OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్‌ డేట్‌ ప్రకటించరా?

NTV Telugu 3 days ago

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు థియేట్రికల్ మాత్రమే సర్వస్వం. కానీ ఇప్పుడు కాలం మారింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకు ఓటీటీ క్లియరెన్స్ అనేది అత్యంత కీలకంగా మారింది.

థియేటర్లలో సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే నాన్-థియేట్రికల్ రెవెన్యూనే నిర్మాతలకు పెద్ద సేఫ్ జోన్. అయితే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు భారీ సినిమాలకు షాక్ ఇస్తుండటంతో రిలీజ్ డేట్లను ప్రకటించడానికి కూడా నిర్మాతలు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తోంది.

కన్నడ స్టార్ హీరో యశ్ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్‌’. మొదట ఈ సినిమాను మార్చి 19న ఆ తర్వాత జూన్ 4న విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడింది. ఈ వాయిదా వెనుక అసలు కారణం ఓటీటీ బిజినెస్ క్లియర్ కాకపోవడమే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ‘టాక్సిక్’ బడ్జెట్ ఇప్పటికే రూ. 500 కోట్లు దాటిపోయినట్లు సమాచారం. ఇంత భారీ బడ్జెట్ రికవరీ కావాలంటే ఓటీటీ రూపంలో కనీసం రూ. 250 కోట్లు వస్తుందని మేకర్స్ అంచనా వేశారు. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం కేవలం రూ. 120 కోట్ల వరకే ఆఫర్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. తాము ఆశించిన రేటు రాకపోవడంతో బిజినెస్ క్లియర్ అయ్యే వరకు రిలీజ్ డేట్‌పై ముందడుగు వేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ క్లియరెన్స్ రాకుండా థియేటర్లలోకి వస్తే బడ్జెట్ రికవరీ పరంగా రిస్క్ ఎక్కువ అనే ఉద్దేశంతోనే ‘టాక్సిక్’ వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

కేవలం ‘టాక్సిక్’ మాత్రమే కాదు.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’, యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా హిస్టారికల్ ఫిల్మ్ స్వయంభు చిత్రాలకు కూడా ఇదే తరహా ఓటీటీ సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాల బడ్జెట్లు అంచనాలకు మించి పెరిగిపోయాయి. పెరిగిన బడ్జెట్‌ను ఎంతోకొంత కవర్ చేసుకోవడానికి ఓటీటీ రైట్స్ పెద్ద దిక్కు. కానీ గతంలో లాగా ఓటీటీ సంస్థలు కళ్ళు మూసుకుని వందల కోట్లు కుమ్మరించడం లేదు. మార్కెట్ ఒడిదొడుకులు, సబ్‌స్క్రిప్షన్ల లెక్కలను బట్టి చాలా తక్కువ ధరలకే రైట్స్ అడుగుతున్నాయి. దీంతో బడ్జెట్ ఒకలా ఉంటే ఓటీటీ ఆఫర్లు మరోలా ఉండటంతో బిజినెస్ డీల్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఓటీటీ డీల్స్ క్లియర్ అయితేనే నిర్మాతలకు ఆర్థికంగా ఒక భరోసా దొరుకుతుంది. ఆ క్లియరెన్స్ వచ్చే వరకు రిలీజ్ డేట్లు ప్రకటించలేక ఒకవేళ ప్రకటించినా వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి పెద్ద సినిమాలకు సైతం ఎదురవుతోంది. రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మరియు ఓటీటీ ఆఫర్ల మధ్య సమతుల్యత ఎలా కుదురుతుందో చూడాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu