Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..

Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..

NTV Telugu 5 days ago

Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ నిరసల్ని ప్రసారం చేసిన తర్వాత ఖతార్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ''అల్ జజీరా''పై పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలిసింది.

అయితే అధికారికంగా నిషేధం ప్రకటించలేకపోయినా, దేశంలో అల్ జజీరా ఇంగ్లీష్ వెబ్ సైట్ అందుబాటులో లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మరోవైపు, పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అల్ జజీరాపై తీవ్ర విమర్శలు చేసింది. పీఓకేలో ఎన్నికలకు సంబంధించి కొన్ని పోలింగ్ కేంద్రాలను టార్గెట్ చేసి వార్తల్ని ప్రసారం చేసిందని ఆరోపించింది.

అల్ జజీరా కథనాలను పాక్ ప్రభుత్వం ''ఎల్లో జర్నలిజం''గా అభివర్ణించింది. ఎన్నికల ప్రక్రియను అపఖ్యాతి చేయడంతో పాటు బాహ్య శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మరోవైపు, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (CPJ) పీఓకేలో మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ నిలిపేయడంతో పాటు జర్నలిస్టులపై ఆంక్షలు, కొందరు మీడియా జర్నలిస్టులు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రాజీ తాహిర్, మహ్మద్ సైఫ్ ఆగస్టు 1 నుంచి కనిపించకుండా పోయారని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ అదుపులో ఉంటే అధికారికంగా ప్రకటించి, చట్ట ప్రక్రియ పాటించాలని సీపీజే డిమాండ్ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu