Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంచాయితీరాజ్ చట్టం : మరో ఆర్డినెన్స్ జారీ చేసిన జగన్ సర్కార్

పంచాయితీరాజ్ చట్టం : మరో ఆర్డినెన్స్ జారీ చేసిన జగన్ సర్కార్

NTV Telugu 6 years ago

గతంలో నిమ్మగడ్డ వ్యవహారం కంటే ముందు పంచాయితీరాజ్ చట్టంలో సవరణలు తీసుకువస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్సు కాలపరిమితి ముగిసింది. దీంతో మరోమారు ఆర్డినెన్సు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఆరు నెలల్లో చట్ట రూపం దాల్చకపోవటంతో మళ్లీ ఆర్డినెన్సు జారీ చేసింది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలపై గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వ్యవధిని 13 నుంచి 15 రోజులను కుదిస్తూ ఈ ఆర్డినెన్సు జారీ చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసిన అభ్యర్ధులపై అనర్హతా వేటు వేసేలా ఈ ఆర్డినెన్సులో కఠిన నిబంధనలు ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఆ ఆర్డినెన్సు కాలపరిమితి ముగియడంతో మరోమారు ఆర్డినెన్సు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu