Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరుగు సీక్వెల్ లో బన్నీ...

పరుగు సీక్వెల్ లో బన్నీ...

NTV Telugu 6 years ago

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పరుగు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో `పరుగు` బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా `హీరో పంతి` పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. అక్కడ కూడా ఈ సినిమా హిట్ దక్కించుకుంది. ఈ సినిమాను హిందీలో షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని చూస్తున్నారు. దానికి టైగర్ ఆసక్తిగా ఉండటంతో హీరో పంథి సీక్వెల్ కథను షబ్బీర్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బన్ని ఓ గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని ఆ మూవీ మేకర్ సాజిద్ బన్నీని అప్రోచ్ అయ్యినట్లు టాక్ వినిపిస్తోంది.

మరి తన సినిమా సీక్వెల్ లో నటించడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది మాత్రం తెలియదు. తెలుగులో కూడా 'పరుగు' సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని నిర్మాత దిల్ రాజు ప్రయతినిస్తున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu