Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!

Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!

NTV Telugu 6 days ago

Pat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) కీలక విజయం సాధించింది.

ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంపై ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. చెపాక్ వంటి టఫ్ పిచ్‌పై ఛేదన పూర్తి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సాధారణంగా తాము ఆడే దూకుడు శైలికి భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ కీలక భాగస్వామ్యమే మ్యాచ్‌ను మలుపుతిప్పిందని.. ఈ విజయం క్రెడిట్ వారికే ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. 'ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బంతి నెమ్మదిగా వచ్చింది. కొన్నిసార్లు గ్రిప్ కూడా అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన బ్యాటర్లకు ఆడటం చాలా కష్టం. కానీ ఇషాన్, క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కొందరు బౌలర్లను టార్గెట్ చేస్తూ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారు. ఆ భాగస్వామ్యమే మ్యాచ్ గెలిపించింది' అని తెలిపాడు. గత మ్యాచ్‌లో తక్కువ స్కోరుకు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ విధానంపై ఎలాంటి చర్చ జరిగిందని అడగగా కమిన్స్ సరదాగా స్పందించాడు. 'మేము నిలకడైన బ్యాటింగ్‌ చేయం. కానీ అవసరం వచ్చినప్పుడు ఎలా ఆడాలో మా ఆటగాళ్లకు తెలుసు. ఈ పిచ్‌పై మొదటి నుంచే దూకుడుగా ఆడటం సరైంది కాదని అర్థమైంది. పరిస్థితులకు తగ్గట్టు ఆడినందుకే ఈ విజయం సాధించాం' అని చెప్పుకొచ్చాడు.

చెన్నై చేసిన 180 పరుగుల స్కోర్ గురించి కూడా కమిన్స్ మాట్లాడాడు. 'ఈ వికెట్‌పై 180 పరుగులు మంచి స్కోరే. బహుశా అది తక్కువ స్కోర్ లేదా కాస్త ఎక్కువ కూడా కావచ్చు. కానీ మాకు 1-2 మంచి భాగస్వామ్యాలు అవసరమని తెలుసు. ఒకసారి క్రీజులో సెట్ అయితే బ్యాటింగ్ కొంచెం సులభమవుతుంది. చెన్నై ఆటగాళ్లకు ఈ పిచ్‌ను బాగా చదివారు. ఇక్కడ ఛేదన చేస్తూ చాలా జట్లు విజయాలు సాధించాయి. అందుకే వారు తీసుకున్న నిర్ణయం మమ్మలి ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. టాప్-2లో నిలిచే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు అసలైన పోరు మొదలవుతోంది. మా జట్టులో మంచి వాతావరణం ఉంది. ఇషాన్ కూడా మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చూసుకున్నాడు. అతడికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. జట్టు ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది' అని చెప్పాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu