Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!

Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!

NTV Telugu 4 days ago

Pawan Kalyan Fans Amalapuram: జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహిళా అభిమానులు వినూత్నంగా చేశారు.

పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలు తమ ఇళ్ల ముందు ప్రత్యేకంగా రంగురంగుల ముగ్గులు వేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగలకు ఇళ్ల ముందు ముగ్గులతో శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా అదే తరహాలో ముగ్గులు వేయడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది.

అమలాపురంలోని రవణం వీధిలో మహిళలు తమ ఇళ్ల వాకిట్లో రంగులతో ‘హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్’, ‘హ్యాపీ బర్త్‌డే డిప్యూటీ సీఎం’ అంటూ అందమైన ముగ్గులు వేశారు. రంగురంగుల డిజైన్లతో పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ముగ్గుల్లో పవన్ నటించిన పలు సినిమాల పేర్లను కూడా అందంగా పొందుపరిచారు. 'బద్రి', 'జల్సా', 'ఓజీ', 'పంజా', 'బాలు', 'తొలిప్రేమ' వంటి చిత్రాల పేర్లను ముగ్గుల చుట్టూ రంగులతో అలంకరించారు. దీంతో ఈ వినూత్నమైన ముగ్గులు స్థానికుల దృష్టిని ఆకర్షించడంతో పాటు పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తమకు ఒక పండుగ రోజు లాంటిదని అమలాపురం మహిళలు అంటున్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను ఎంత ఆనందంగా జరుపుకుంటామో.. పవన్ పుట్టినరోజును కూడా అంతే ఉత్సాహంతో జరుపుకుంటున్నామని చెప్పారు. ‘అమలాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అభిమానుల అడ్డా’ అని పేర్కొన్నారు. పవన్ మరింత ఉన్నత పదవులు చేపట్టి రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu