ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడంతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో ఆయనకు కార్డియాక్ సంబంధిత సమస్య తలెత్తింది.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హుటాహుటిన విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆయుష్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం పవన్ కళ్యాణ్‌కు అవసరమైన వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న వైద్యులు, పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చికిత్సను అందించనున్నారు. ఉపముఖ్యమంత్రి అస్వస్థత వార్తతో అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

