Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!

PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!

NTV Telugu 3 weeks ago

PEDDI: టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రాజెక్ట్ పెద్ది. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో వార్త అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది, తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల పంచుకున్న విశేషాలు సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారాయి.

70, 80ల నాటి నెటివిటీని వెండితెరపై పునఃసృష్టి చేసేందుకు చిత్ర బృందం ఎంతలా కష్టపడుతుందో ఆయన వివరించారు. సాధారణంగా ఏదైనా పీరియడ్ డ్రామా తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే 'పెద్ది' విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమా ప్రపంచాన్ని నిర్మించడం కోసం కేవలం ప్రీ-ప్రొడక్షన్ పనులకే దాదాపు ఒక సంవత్సరం పాటు సమయం కేటాయించినట్లు అవినాష్ కొల్లా వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని మారుమూల పల్లెటూళ్లలో 1970 – 80ల కాలంలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యం.

ఈ చిత్రానికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సినిమా కోసం ఏకంగా 24 భారీ సెట్లను రూపొందించారు. ఆ కాలం నాటి ఇళ్లు, వీధులు, వాతావరణం ప్రతిబింబించేలా ఈ సెట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. నేటి ఆధునిక కాలంలో ఆ పాత తరం నాటి 'రస్టిక్' లుక్‌ను తీసుకురావడం ఒక సవాల్‌గా అనిపించినా, విజువల్స్‌లో ఆ మ్యాజిక్ ఖచ్చితంగా కనిపిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. విజయనగరం మట్టి వాసన, అక్కడి యాస, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఆర్ట్ డైరెక్షన్ పరంగా అవినాష్ కొల్లా తీసుకున్న జాగ్రత్తలు, ఆ 24 భారీ సెట్లు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu