Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

NTV Telugu 1 week ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాల గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు.

గత రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో గ్రాండ్ గా జరిగింది. కాగా పెద్ది ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కుల రూపంలో ‘పెద్ది’ సుమారురూ. 218.5 కోట్ల మేర భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. మెగా పవర్ స్టార్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు.

అయితే ఈ స్థాయి భారీ బిజినెస్ జరగడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే దాదాపు రూ. 400 నుండి రూ. 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. రామ్ చరణ్ గత చిత్రాలైన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక నిరాశపరిచాయి. దీంతో ఈ ‘పెద్ది’ చిత్రం ఫలితంపై మెగా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. చరణ్ ఈ సినిమాతో ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ట్రేడ్ అంచనా ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజే వరల్డ్‌వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu