Dailyhunt
Peddi: చరణ్ 'పెద్ది' పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న 'రావు బహదూర్'కు థియేటర్ల సెగ!

Peddi: చరణ్ 'పెద్ది' పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న 'రావు బహదూర్'కు థియేటర్ల సెగ!

NTV Telugu 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భారీ మాస్ ఎంటర్‌టైనర్ 'పెద్ది'తో జూన్ 4న బాక్సాఫీస్ వద్ద గర్జించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా రాకతో మిగతా సినిమాలకు గట్టి పోటీ ఎదురవుతోంది.

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో, సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' ఇప్పుడు చిక్కుల్లో పడింది. నిజానికి ఈ చిన్న సినిమాను జూన్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, చరణ్ సినిమా ధాటికి దీనికి థియేటర్లు దొరకడం కష్టంగా మారింది.

'పెద్ది' సినిమాకు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా మెజారిటీ థియేటర్లు, షోలు ఆ సినిమాకే కేటాయించే అవకాశం ఉంది. దీనివల్ల మహేష్ బాబు బ్రాండ్ పేరు ఉన్నప్పటికీ, సత్యదేవ్ సినిమాకు కనీస స్థాయిలో స్క్రీన్లు దొరకడం గగనమే అనిపిస్తోంది. ఇప్పుడు 'రావు బహదూర్' టీమ్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి రిస్క్ తీసుకుని చరణ్ సినిమాతో పోటీ పడటం, లేదా క్లాష్‌ను తప్పించుకుని మరో మంచి డేట్‌ను చూసుకోవడం. కంటెంట్ నమ్ముకున్న సినిమాలు ఇలాంటి భారీ చిత్రాల మధ్యలో నలిగిపోవడం కంటే, సోలోగా వచ్చి హిట్ కొట్టడమే బెటర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu