Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది 'పెయిడ్ ప్రీమియర్స్' ప్లానింగ్

PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది 'పెయిడ్ ప్రీమియర్స్' ప్లానింగ్

NTV Telugu 3 weeks ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ క్రీడా నేపథ్య చిత్రం పెద్ది విడుదల విషయంలో మేకర్స్ మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.

ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

స్టార్ హీరోల సినిమాలకు తెలుగులో ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ కోసం మేకర్స్ భారీ స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 4న సినిమా విడుదల కానుండగా అంతకంటే ఒక రోజు ముందే అంటే జూన్ 3న ఇండియా అంతటా ఈ ప్రీమియర్స్ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా అవుట్‌పుట్ మీద ఉన్న నమ్మకంతోనే నిర్మాత వెంకట సతీష్ కిలారు డేరింగ్ డెషిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర హిందీ వెర్షన్ మరియు ఉత్తరాది పంపిణీ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఇటీవల బాలీవుడ్ ల వచ్చిన రణవీర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ కోసం అనుసరించిన ప్రమోషన్ మరియు రిలీజ్ స్ట్రాటజీనే ‘పెద్ది’ కోసం కూడా అమలు చేయబోతున్నారు. బాలీవుడ్ మార్కెట్‌లో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేందుకు జియో స్టూడియోస్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu