Dailyhunt
PEDDI : పెద్ది థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్.. ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ఫైట్

PEDDI : పెద్ది థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్.. ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ఫైట్

NTV Telugu 1 week ago

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది‘. జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా ఆంధ్రాలోని కీలకమైన ఈస్ట్ గోదావరి జిల్లా పంపిణీ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ మరియు బుచ్చిబాబు సన మార్క్ మేకింగ్‌పై నమ్మకంతో ‘పెద్ది’ చిత్రానికి కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయి. అయితే, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇంకా ఏ బయ్యర్ ఫైనల్ కాలేదని బిజినెస్ వర్గాల సమాచారం. దీనికి ప్రధాన కారణం రేటు విషయంలో జరుగుతున్న చర్చలేనని తెలుస్తోంది.

ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం నిర్మాతలు రూ. 13 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా ఈ రేటు చెప్తున్నారు. బయ్యర్లు రూ. 11 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బేరాలు జరుగుతున్నాయి. రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు కాకుండా మరో ఇద్దరు బయ్యర్స్ రూ. 13 కోట్లకు కూడా సినిమాను కొనేందుకు రెడీగా ఉన్నారని నిర్మాణ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం. అయితే రెగ్యులర్ డిస్టిబ్యూటర్స్ కే రైట్స్ ఇవ్వలలనేది మేకర్స్ ఆలోచన. అటు నెల్లూరు కూడా దాదాపు రూ. 4 కోట్లకు పైగానే రేటు పలుకున్నట్టు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu