Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi : 'పెద్ది' ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!

Peddi : 'పెద్ది' ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!

NTV Telugu 5 days ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (PEDDI). మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పెద్ది' చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇక తాజాగా ముంబై వేదికగా విడుదలైన ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డుల రచ్చ సృష్టిస్తూ, కేవలం కొన్ని గంటల్లోనే కోట్లాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌కు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty) చేరిపోయారు. 'పెద్ది' ట్రైలర్‌పై ఆయన కురిపించిన ప్రశంసల జల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

' 'పెద్ది' అఫీషియల్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతీ ఫ్రేమ్‌లోనూ ఒక ఫైర్ చూపిస్తూ స్టన్నింగ్ విజువల్స్‌తో అదరగొట్టాడు. ఇక మన కన్నడ లెజెండ్, సెంచరీ స్టార్ శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ట్రైలర్‌లో మరింత పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపించింది. హీరోయిన్ జాన్వీ కపూర్ పల్లెటూరి లుక్‌లో చాలా అందంగా కనిపిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన ఎక్సలెంట్ వర్క్ అందించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. 'పెద్ది' సినిమా యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్!' అని తెలిపాడు.దీంతో ఇప్పుడు రిషబ్ శెట్టి లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ 'పెద్ది' ట్రైలర్‌ను ఓపెన్‌గా సపోర్ట్ చేయడంతో కర్ణాటక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu