Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi: పెద్ది'పై హైప్రెజర్ ?

Peddi: పెద్ది'పై హైప్రెజర్ ?

NTV Telugu 2 days ago

విడుదలకు ముందే ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘పెద్ది’. కానీ, ఈ హైప్ మొత్తం నిజంగానే కథ, మేకింగ్ వల్ల వచ్చిందా? లేక రామ్ చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల పెరిగిందా?

నిజమైన పెహల్వాన్లతో షూటింగ్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి? షూటింగ్ సమయంలో ఆర్టిస్టుల నుంచి నాచురల్ ఎమోషన్స్ రావడానికి దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి పద్ధతులు ఫాలో అయ్యాడో ఇప్పుడు చూద్దాం. ‘పెద్ది’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమాపై హైప్ కూడా భారీగానే పెరుగుతోంది. ప్రమోషన్స్ బాధ్యత చరణ్, బుచ్చిబాబు ఇద్దరే తీసుకున్నారా అనే టాక్ కూడా ఒకవైపు వినిపిస్తోంది. అందులో భాగంగానే ‘A Driving Through Peddi Memories’ వీడియో రిలీజ్ అయింది.

‘పెద్ది’ కథ మొదట వినగానే రామ్ చరణ్ ఆసక్తి చూపాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కారణం.. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాకుండా, గ్రామీణ బ్యాక్ డ్రాప్‌లో సాగే రా అండ్ ఎమోషనల్ కథ కావడమే! ఇంకా స్క్రిప్ట్ బాగా కుదిరిందని, ఆ స్క్రిప్ట్ కి పడిపోయాడట చరణ్. దేశీ పెహల్వాన్ పాత్ర కోసం చరణ్ దాదాపు ఏడాదికి పైగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. షూటింగ్ లో నిజమైన పెహల్వాన్లను ఉపయోగించడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. ఫైట్ సీన్స్ ఎక్కువగా నాచురల్ గా కనిపించేందుకు రియల్ రెజ్లర్లతోనే రిహర్సల్స్ చేశారట. అయితే, ఆ ఫైట్స్ లోనే చరణ్ చేతికి గాయమైంది. అయినా షూటింగ్ ఎక్కడా ఆగలేదు. ఇలాంటి రియలిస్టిక్ అప్రోచ్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఆడియన్స్‌కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో రిలీజ్ తర్వాతే క్లారిటీ వస్తుంది.

దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా ట్రీట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నటీనటుల నుంచి సహజమైన భావోద్వేగాలు రాబట్టేందుకు సెట్స్ పై ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేశాడట. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే దిల్లీ ఎపిసోడే ఈ సినిమా కథ అంటున్నాడు చరణ్. ఆ దిల్లీ ఎపిసోడ్ లో చరణ్ నటనను ప్రశంసిస్తున్నాడు బుచ్చిబాబు.’పెద్ది’ ఇప్పుడు టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య రానున్న ప్రాజెక్ట్; కానీ, ఈ సినిమాపై ప్రెజర్ కూడా అంతే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ నుంచి ప్రేక్షకులు ఇప్పుడు సాధారణ కమర్షియల్ సినిమా కంటే కొత్త అనుభవాన్ని ఆశిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న ఈ సమయంలో ‘పెద్ది’ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా? లేక అంచనాల భారంతో తడబడుతుందా? అనేది జూన్ 4న తేలిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu