Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PEDDI Press Meet : 'పెద్ది' షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్

PEDDI Press Meet : 'పెద్ది' షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్

NTV Telugu 5 months ago

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూన్ 25న రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు.

కానీ ఇప్పుడు ఆ డేట్ మరోసారి చేంజ్ కాబోతుంది. అందుకు సంబంధించి చిత్ర యూనిట్ నేడు కీలక ప్రకటన చేయబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు పెద్ది సినిమా మేకర్స్ ఒక భారీ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

అలాగే ఈ సినిమా షూటింగ్ నిన్నటితో ముగిసింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు అన్ని పాటలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ ‘పెద్ది’ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా ఇక కేవలం ఒకే ఒక పాటను మాత్రమే రిలీజ్ చేయాలనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే శృతి హాసన్ నటించిన సాంగ్. ఇది ‘ఐటమ్ సాంగ్’ కాదు సినిమా కథలో భాగంగా వచ్చే ఒక ‘స్పెషల్ సాంగ్’. శృతి హాసన్ ఎనర్జీ మేకర్స్ మేకింగ్ స్టైల్ కలిసి ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయని సమాచారం. శృతి హాసన్ సాంగ్ మినహా సినిమాలో ఉండే మిగిలిన పాటలన్నీ డైరెక్ట్ గా సినిమాలోనే చూసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం జరగబోయే ప్రెస్ మీట్‌లో ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu