Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!

Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!

NTV Telugu 1 week ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

“ఇక అసలు ఆట మొదలవ్వబోతోంది” అంటూ చిత్ర బృందం అభిమానుల్లో పూనకాలు తెప్పించే వార్తను పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు (మిర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ‘రాంబుజ్జి’ అనే పవర్‌ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4వ తేదీన థియేటర్లలో ఈ చిత్రం అత్యంత భారీ ఎత్తున విడుదల కాబోతోంది. సమ్మర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగించేందుకు, ప్రేక్షకులకు పూర్తిస్థాయి మాస్ వినోదాన్ని పంచేందుకు రామ్ చరణ్ సిద్ధమయ్యాడు. దీంతో నెట్టింట అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

అందుకు తగ్గట్టుగానే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కన్నడ కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్, సీనియర్ నటులు బొమన్ ఇరానీ, జగపతి బాబు ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు ‘రాంబుజ్జి’గా దివ్యేందు ఎంట్రీతో కాస్టింగ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలిచేందుకు స్టార్ కెమెరామెన్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా కొల్లా అవినాష్ పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, అలాగే జియో స్టూడియోస్ (జ్యోతి దేశ్‌పాండే) సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొత్తానికి జూన్ 4న ‘పెద్ది’ సృష్టించబోయే ప్రభంజనం కోసం యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu