Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ

PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ

NTV Telugu 1 week ago

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీ నుంచి యూఏఈకి బయల్దేరి వెళ్లారు. ఇక అబుదాబి చేరుకోగానే మోడీకి ప్రత్యేక గౌరవం లభించింది. ఎఫ్-16 యుద్ధ విమానాలు మోడీ విమానానికి రక్షణగా వెళ్లాయి.

ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం బహిర్గతం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక అబుదాబిలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి రాష్ట్రపతి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గౌరవ వందనంతో స్వాగతం పలికారు. మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఇంధన భద్రత దృష్ట్యా భారతదేశానికి ఈ పర్యటన ముఖ్యమైనది. ఇక పర్యటనలో భాగంగా యూఏఈతో భారత్‌ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎల్పీజీ సరఫరాలపై యూఏఈతో భారత్‌ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్‌లపై యూఏఈతో భారత్‌ ఎంవోయూ చేసుకుంది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై కూడా యూఏఈతో ఒప్పందం చేసుకుంది.

యూఏఈ భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గత 25 ఏళ్లలో ఇది ఏడవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. యూఏఈలో 45 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. యూఏఈ అనంతరం ప్రధాని మోడీ నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, చివరగా ఇటలీలో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

ఇక యూఏఈపై ఇరాన్ దాడిని ప్రధాని మోడీ ఖండించారు. ఇక పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలపై ఉందని చెప్పారు. హార్ముజ్ విషయంలో అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేశాయి. పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలు నష్టపోయాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu