ఆన్ లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపిన ప్రభుత్వం ఈ నెల 31వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ నెల తర్వాతే విద్యా సంవత్సరం పై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పిన ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదలు కాక ముందే ఆన్ లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వనట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఓవైపు అనుమతి ఇవ్వలేదంటునే .. మరోవైపు అడ్డుకోవడం లేదని ప్రభుత్వం ధ్వంద్వ వైఖరి తో దాగుడు మూతలు ఆడకూడదని, మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అయితే తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్థంభించిపోతుంది అని తెలిపిన విద్యా సంస్థల న్యాయవాది వారి కెరీర్ కోసం నెల రోజులుగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

