Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Prashanth Neel: ప్రశాంత్ నీల్ 'డ్రాగన్ 2' మాస్టర్ ప్లాన్ లీక్!

Prashanth Neel: ప్రశాంత్ నీల్ 'డ్రాగన్ 2' మాస్టర్ ప్లాన్ లీక్!

NTV Telugu 2 days ago

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన ఈ సినిమా, లేటెస్ట్ గా విడుదలైన గ్లిమ్స్ తో ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది.

ముఖ్యంగా తారక్ మాస్ లుక్, డార్క్ టోన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో YouTube లో 24 గంటల్లోనే ఏకంగా 64 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘డ్రాగన్ పార్ట్ 2’ గురించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

‘డ్రాగన్’ కథ చాలా పెద్ద స్థాయిలో ఉండడంతో ప్రశాంత్ నీల్ దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లు టాక్. అయితే ఈసారి ‘సలార్’ మూవీలా కాకుండా ఒక పక్కా ప్లాన్ వేస్తున్నాడట నీల్, ‘సలార్’ సినిమాను రెండు భాగాలుగా ప్రకటించిన ప్రశాంత్ నీల్, మధ్యలో ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ ను సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. కానీ, ‘డ్రాగన్’ పార్ట్స్ మధ్య మాత్రం ఎలాంటి గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడట. అందుకే, పార్ట్ 1 తో పాటే పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

చాలా తక్కువ గ్యాప్ లోనే ‘డ్రాగన్ 2’ ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నారు. డ్రాగన్ పార్ట్ 1: జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డ్రాగన్ పార్ట్ 2: కేవలం ఆరు నెలల వ్యవధిలోనే, అంటే డిసెంబర్ 2027 లోనే రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా, సెకండ్ పార్ట్ మాత్రం ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్ అయిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’ నేపథ్యంలో ఉండబోతోంది. అన్నట్టు.. పార్ట్ 1 కోసం బాగా బరువు తగ్గిన ఎన్టీఆర్, పార్ట్ 2 కి వచ్చేసరికి కథ డిమాండ్ మేరకు మళ్ళీ బల్క్ లుక్ లోకి మారనున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. మరి ప్రశాంత్ నీల్ సృష్టించబోయే ఈ డ్రాగన్ సామ్రాజ్యం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను వేటాడనుందో చూడాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu