Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

NTV Telugu 4 days ago

మ్మర్ కానుకగా మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంతో ఆయన తనయుడు పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత కోటేశ్వరరావు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర, సంచలన విషయాలు పంచుకున్నారు. తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిని అని ఆయన తెలిపారు. “'గోకులంలో సీత' సినిమా చూసినప్పటి నుంచే నేను ఆయన ఫ్యాన్‌గా మారిపోయాను. ఆ వయసులో నన్ను నేను ఆయనలో చూసుకున్నాను. నాకు కొడుకు పుడితే కచ్చితంగా ఆయన పేరే పెట్టుకోవాలని డిసైడ్ అయ్యా. అనుకున్నట్టుగానే ‘తమ్ముడు’ సినిమా టైమ్‌లో మాకు బాబు పుట్టడంతో పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాను” అని ఆయన వెల్లడించారు.

గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన తనకు సినీ నేపథ్యం ఏమాత్రం లేదని, కేవలం తన అబ్బాయికి ఉన్న సిగ్గు, బిడియం పోగొట్టడానికే ఇండస్ట్రీకి వచ్చానని కోటేశ్వరరావు కుండబద్దలు కొట్టారు. “డబ్బుల కోసమో, లాభాలు ఆశించో నేను ఈ సినిమా తీయలేదు. హీరో అవ్వాలన్న నా కలను నా కొడుకు ద్వారా నెరవేర్చుకుంటున్నాను. అయితే, మా అబ్బాయికి ముందే ఒక కండిషన్ పెట్టాను. నా స్థోమత కొద్దీ అతనికి ఒక మూడు సినిమాలు తీస్తాను.. అప్పటిలోగా హీరోగా నిలబడితే ఓకే, లేదంటే మళ్లీ ఊరొచ్చి వ్యవసాయం చేసుకోవాలని ముందే తేల్చి చెప్పేశాను” అని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu