Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Purusha Hero: మా నాన్న కలే నన్నిలా హీరోను చేసింది!

Purusha Hero: మా నాన్న కలే నన్నిలా హీరోను చేసింది!

NTV Telugu 1 week ago

త్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో, వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’ (Purusha:). ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్‌ బత్తుల టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అవుతున్నారు.

రాయంచ కొక్కుర హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించి తన సినీ ప్రయాణం, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన బ్యాక్‌గ్రౌండ్ గురించి చెబుతూ.. “మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లో ఉన్న కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. మా నాన్న కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నారు. మా నాన్నకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ఆయన ‘గోకులంలో సీత’ సినిమా చూసిన టైమ్‌కి నేను ఇంకా పుట్టలేదు. ఆ తర్వాత ‘తమ్ముడు’ సినిమా టైమ్‌లో నేను పుట్టడంతో.. నాకు ‘పవన్ కళ్యాణ్’ అని పేరు పెట్టారు. నన్ను హీరోగా చూడాలన్నది మా నాన్నగారి కల. నాకు కూడా సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇటు వైపుగా అడుగులు వేశాను” అని పవన్ తెలిపారు.

యాక్టింగ్‌లో తాను వైజాగ్‌లో స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద నాలుగు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నానని పవన్ తెలిపారు. “డీఓపీ సతీష్ వల్లే ఈ కథ మా దగ్గరకు వచ్చింది. నా మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని ఈ ఫ్యామిలీ స్టోరీని ఎంచుకున్నాను. ఇది ఒకప్పుడు వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమా వైబ్‌లో ఉంటుంది. ఇందులో సప్తగిరి, కసిరెడ్డి నాకు ప్రతి విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. అలాగే, ఇంట్రోవర్ట్‌గా ఉండే నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చి దర్శకుడు వీరు అన్న బాగా యాక్ట్ చేయించారు. కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది” అని హీరో పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu