Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాములమ్మ-పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఆసక్తికర సంభాషణ..

రాములమ్మ-పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఆసక్తికర సంభాషణ..

NTV Telugu 5 years ago

భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ.. జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు విజయశాంతి.. మహిళలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో చేస్తోందని గుర్తుచేసిన ఆమె.. ఎక్కడ మంచి జరిగినా అక్కడ బీజేపీ ఉంటుందన్నారు.. సమాజంలో చెడుని కూడా క్లీన్ చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికుల నుద్దేశించి మాట్లాడిన ఆమె.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మేలు జరగదని.. బీజేపీ వస్తేనే మేలు జరుగుతుందన్నారు.

ఇక, ఈ కార్యక్రమంలో ముసుకు వేసుకుని ఉన్న రాములమ్మను చూసి... మీరు విజయశాంతియేనా అని ప్రశ్నించారు.. ఒక్కసారి మాస్క్ తీయమని అడిగారు మహిళా కార్మికులు.. దీంతో.. మాస్క్ తీసిన రాములమ్మ ఇప్పుడు ఒకేనా అని ప్రశ్నించగా.. మాస్క్‌లో చూస్తుంటే.. మీరేనా? కాదా? అనుకున్నామని.. అందుకే మాస్క్ తీయమని కోరినట్టు తెలిపారు.. మీరంటే మాకు చాలా ఇష్టం.. మీ ఒసేయ్‌ రాములమ్మ సినిమా నాలుగు సార్లు చూశామని ఈ సందర్భంగా విజయశాంతికి తెలిపారు.. ఇంకా ఏ సినిమాలు చూశారని అడిగిన విజయశాంతి, ఏ సినిమా నచ్చింది అని అడగగా.. మీ సినిమాలు చూస్తే ధైర్యం వస్తుంది.. మిమ్మల్ని అక్కలా..? చెల్లెలా భావిస్తాం అన్నారు. మీ అభిమానంతోనే పెద్ద స్టార్‌ను అయ్యా.. తెలంగాణ కోసం ఉద్యమం చేశా.. తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే.. నాకు సన్మానం చేయరా? మరి అని ప్రశ్నించారు రాములమ్మ.. ఇలా.. రాములమ్మ, పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu