ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభలో కీలకమైన మార్పు చేసింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను ఆప్ నియమించింది.
రాఘవ్ చద్దాను ఉప నాయకుడి పదవి నుంచి తొలగించి.. ఆ బాధ్యతను పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఉన్న డాక్టర్ అశోక్ మిట్టల్‌కు అప్పగించింది. ఈ మార్పుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సచివాలయానికి అధికారిక లేఖను పంపింది. ఇకపై డాక్టర్ అశోక్ మిట్టల్ రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడిగా కొనసాగుతారని పేర్కొంది.
ఇకపై రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని కోరింది. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు కారణంగానే ఈ పరిణామం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల న్యాయస్థానం లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ విషయంపై బహిరంగంగా ఒక్కమాట కూడా రాఘవ్ చద్దా మాట్లాడలేదు. సోషల్ మీడియాలోనూ స్పందించలేదు. ఈ కారణంతోనే ఆయనపై వేటు వేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అశోక్ మిట్టల్ ఎవరు?
డాక్టర్ అశోక్ మిట్టల్ పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దేశంలో అత్యంత గౌరవనీయమైన విద్యావేత్తల్లో ఒకరిగా ఉన్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఛాన్సలర్ కూడా పని చేస్తున్నారు. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపులో రాఘవ్ చద్దాను తొలగించి ఆశ్చర్యపరిచింది.ర
ఇది కూడా చదవండి:Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు

