Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..

Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..

NTV Telugu 4 days ago

Rahul Gandhi: నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత నిరసనలు తెలిపారు. అయితే, విద్యార్థుల్ని బలప్రయోగం, బెదిరింపులతో కేంద్రం అణచివేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులతో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఇళ్లకు గుండాలను పంపించారని, 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసనకారులు రాజ్యాంగ పరిరక్షకులని, కూప్పకూలుతున్న పనికిరాని విద్యా వ్యవస్థను ప్రశ్నిచడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు.

నిరసనల్లో పాల్గొన్న వారి ఇళ్లకు గుండాలను పంపించారని, ఆ తర్వాత 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించి, ఆ క్షమాపణలు అంగీకరించారని, ఇది పూర్తిగా అర్థరహితం, దీనిని తాము అంగీకరించమని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని, వారిని వేధించారని ఆరోపించారు. దేశంలో పారదర్శకంగా పనిచేసే విద్యా వ్యవస్థ అవసరమని అన్నారు. విద్యార్థులు ఎలాంటి హింసకు పాల్పడలేదని, వారిపై లాఠీచార్జ్ చేయడం, వేధించడం సరికాదని అన్నారు. తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న విద్యార్థులపై గర్వంగా ఉందని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu