Rahul Gandhi: నీట్ యూజీసీ 2026 పేపర్ లీక్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన విమర్శలను పెంచారు. వరసగా రెండో రోజు కూడా ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పదే పదే విఫలమవుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీక్ విషయంలో విద్యా మంత్రి రాజీనామా చేయాలని కోరారు.
22 లక్షల మంది నీట్ విద్యార్థులు మోసపోయారని అన్నారు. ప్రధాని విద్యాశాఖ మంత్రిని తొలగించి, ఆ బాధ్యల్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై బాధ్యత వహించడానికి ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరించారని ఆరోపించారు. పేపర్ లీక్‌తో తనకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి చెబుతున్నారని, గతంలో కమిటీ చేసిన సిఫారసుల్ని చెత్తబుట్టలో వేశారని దుయ్యట్టారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ, యూనివర్సిటీ అధికారలు ఒక కూటమిగా ఏర్పడి దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు.

