Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajnikanth: 'రజనీ' అనేవాడు అలాంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పుడూ చేయను!

Rajnikanth: 'రజనీ' అనేవాడు అలాంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పుడూ చేయను!

NTV Telugu 1 week ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో హాంగ్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో రజనీకాంత్ చక్రం తిప్పడని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలవబోతున్నాయని రూమర్స్ వచ్చాయి.

దాంతో విజయ్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ పై ట్రోలింగ్స్ చేసారు. విజయ్ సీఎం కావం రజనీకి ఇష్టం లేదని అందుకే ఇదంతా చేస్తున్నాడని విమర్శలు చేసారు.

ఎన్నికల ఫలితాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ రూమర్లపై ఘాటుగా స్పందించారు రజనీ . ఈ రోజు మీడియా ముఖంగా రజనీకాంత్ మాట్లాడుతూ ‘డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను తాను కలవడం వెనుక కేవలం స్నేహం మాత్రమే ఉందని దానికి రాజకీయ రంగు పూసి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఎన్నికల్లో కొలత్తూర్ నియోజకవర్గంలో సర్ప్రైజింగ్‌గా స్టాలిన్ ఓడిపోవడం తనను ఎంతగానో బాధించింధి. స్టాలిన్ ఓడిపోయినందుకు ఒక స్నేహితుడిగా నేను బాధపడ్డాను. అందుకే ఆయనకు ఓదార్పునిచ్చేందుకు, పరామర్శించడానికి మాత్రమే నేను వెళ్లాను. ముప్పై నలబై సంవత్సరాలుగా నాకు స్టాలిన్ తో సంబంధాలు ఉన్నాయి. కానీ నేను వెళ్లి కలవగానే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు సృష్టించారు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికే నేను స్టాలిన్‌ను కలిశానని రెండు పార్టీలను విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నానని కథనాలు రాశారు. రజనీ ఎప్పుడు అలాంటి పనులు చేయడీ, మీ సూపర్ స్టార్ అలంటి వాడు కాదుని’ సూపర్ స్టార్ స్పష్టం చేశారు. తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లు, రూమర్లకు క్లారిటీ ఇవ్వకపోతే అవి నిజమే అని నమ్మే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చి ఈ వివరణ ఇస్తున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu