Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు

Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు

NTV Telugu 1 week ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) సాధించి విజయ్ CMపైగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ గెలుపుపట్ల తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ ను ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

దాంతో విజయ్ సీఎం అవడం రజినీకి ఇష్టంలేదని ట్రోలింగ్స్ రావడంత ఈ రోజు మీడియా ముఖంగా స్పందించారు సూపర్ స్టార్.

రజనీకాంత్ మాట్లాడుతూ.. "రాజకీయాల్లో విజయ్ సాధించిన విజయం, గతంలో తమిళనాడులో ఎమ్‌జీఆర్ (MGR), ఆంధ్రాలో నందమూరి తారకరామారావు (NTR) సాధించిన విజయాల కంటే చాలా పెద్ద విజయం. ఆ కాలంలో ఆ ఇద్దరు మహానాయకులు ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితుల కంటే, ప్రస్తుత కాలంలో విజయ్ ఎదుర్కొని నిలబడిన పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైనవని ఆయన విశ్లేషించారు. విజయ్ సాగించిన ఒంటరి పోరాటం చేసి కేంద్రంలో పూర్తి అధికార బలంతో ఉన్న బీజేపీని, దశాబ్దాలుగా తమిళనాట పాతుకుపోయిన అధికార డీఎంకే (DMK), బలమైన ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) వంటి రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను విజయ్ ఏకకాలంలో ఢీకొట్టారు. ఎటువంటి పొత్తులు లేకుండా కేవలం సొంత బలంపైనే ఒంటరిగా పోరాడి ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం అసాధ్యమైన విషయం. ఒక నూతన ప్రాంతీయ పార్టీ ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయడం తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. విజయ్ సాధించిన ఈ అసాధారణ గెలుపు తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్తూ.. భవిష్యత్తులో విజయ్ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలని కోరుకుంటున్నాను, విజయ్ పట్ల నాకు ఎటువంటి అసూయా లేదు' నేను రాజకీయాల్లో కూడా లేను, అలాంటప్పుడు విజయ్‌ని చూసి నేనెందుకు అసూయ పడతాను..? బహుశా కమల్ సీఎం అయితేనేమో అసూయ పడొచ్చు. నాకూ విజయ్‌కీ మధ్య తరం అంతరం ఉంది.. మేమిద్దరం ఒకరితో ఒకరు పోటీ పడితే అది మా ఇద్దరికీ మంచిది కాదు అని అన్నారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu