Dailyhunt
Ramayana Part -1 Teaser : రాముడిగా రణబీర్ కపూర్.. 'రామాయణ' పార్ట్ -1 టీజర్ రిలీజ్

Ramayana Part -1 Teaser : రాముడిగా రణబీర్ కపూర్.. 'రామాయణ' పార్ట్ -1 టీజర్ రిలీజ్

NTV Telugu 2 weeks ago

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ' (Ramayana). దర్శకుడు నితేష్ తివారీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి రాముడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

తాజాగా విడుదలైన టీజర్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్‌తోనే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ టీజర్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఆయన కళ్లలో కనిపించే ప్రశాంతత, రాజసం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అత్యంత శక్తివంతమైన రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు. యష్ లుక్ రివీల్ చేయకండా బ్యాక్ షాట్స్ మాత్రమే చూపించారు. ఇక టీజర్‌లోని విజువల్స్ మరియు పాత్రల పరిచయం సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఈ గ్లింప్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ గురించి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపిస్తూ ప్రాచీన భారతదేశాన్ని కళ్లముందు ఉంచుతోంది. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సంగీతం మరియు విజువల్స్ కలయిక ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవబోతున్నాయని అనిపిస్తోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి 'రామాయణ పార్ట్ 1' విడుదల కానుండగా అప్పుడే ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu