Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్

RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్

NTV Telugu 3 weeks ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' హంగామా దాదాపు ముగిసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది యావరేజ్ గా నిలిచింది. ఇక కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ RC17 తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. చరణ్, కియారా జోడీ గతంలో వినయ విధేయ రామ, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాల్లో కలిసి నటించారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే చరణ్‌తో కియారాకు ఇది మూడో సినిమా అవుతుంది. సుకుమార్ తన ‘పుష్ప’ తరహాలోనే ఈ చిత్రంలోనూ హీరోయిన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాత్రకు కియారా అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. కానీ ఫ్యాన్స్ మాత్రం కియారా అంటే కాస్త భయపడుతున్నారు. ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో కియారా కాకుండా ఇంకెవరైనా అయితే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu