Dailyhunt
Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?

Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?

NTV Telugu 1 week ago

Rini Sampath: అమెరికా గడ్డపై నయా చరిత్ర సృష్టించేందుకు ఒక భారతీయ మూలాలు ఉన్న మహిళ సిద్ధం అవుతుంది. వాషింగ్టన్, డి.సి.లో మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ రీని సంపత్ పోటీ చేస్తున్నారు. తమిళనాడులో జన్మించిన రీని, ప్రైమరీ ఎన్నికల బ్యాలెట్‌లో కనిపించిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా నిలిచారు. భారత మహిళ అయిన రీని, డెమోక్రటిక్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 31 సంవత్సరాల రీని ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆమె తన ప్రచారాన్ని ప్రాథమిక విషయాలపై కేంద్రీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను రాజకీయ నాయకురాలిని కాదు. నేను ఏ ఒక్క వర్గానికి కట్టుబడి లేను. ఇది కేవలం మన నగరం యొక్క ప్రాథమిక సేవలను మెరుగుపరచడంపై మాత్రమే దృష్టి పెట్టాల్సిన సమయం” అని రీని సంపత్ తన ఎన్నికల వెబ్‌సైట్‌లోని ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

READ ALSO: Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

రిని ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చారు. ఆమె దశాబ్దానికి పైగా వాషింగ్టన్ డి.సి.లో నివసిస్తున్నారు. “మా విజయానికి స్పష్టమైన మార్గం ఉందని నమ్మకం” ఉందని ఆమె అన్నారు. కేవలం నాలుగు వారాల్లోనే “డి.సి. చరిత్రలో మేయర్ ఎన్నికల బ్యాలెట్‌లో కనిపించిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా మేము నిలిచాము” అని రిని చెప్పారు. “డీసీ మేయర్‌గా, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేలా చూడటమే నా ప్రాధాన్యతలుగా ఉంటాయి. మన రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలి. పొటోమాక్ నదిలోకి వినాశకరమైన మురుగునీటి విడుదలను ఆపాలి. ధరలను తగ్గించాలి. 911 నిరీక్షణ సమయాలను తగ్గించాలి” అని రీని అన్నారు. నిజానికి వాషింగ్టన్ డి.సి.లో డెమోక్రాట్లకు బలమైన ప్రభావం ఉంది. 1975లో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరానికి రిపబ్లికన్ మేయర్ ఎన్నడూ ఎన్నిక కాలేదు. అంతకు ముందు, ఈ నగరాన్ని యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిచే నియమించిన కమీషనర్ల బోర్డు పరిపాలించేది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను ప్రజలు ఎన్నుకున్న ఒక మేయర్, 13 మంది సభ్యుల మండలి పరిపాలిస్తుంది.

READ ALSO: Fauzi Movie Leaks: లీకు వీరులకు 'ఫౌజీ' టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu