Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్‌ లో మత్తెక్కించే దృశ్యాలు. ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ

Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్‌ లో మత్తెక్కించే దృశ్యాలు. ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ

NTV Telugu 6 days ago

Romantic Comedy Movie OTT : ఓటీటీల ప్రపంచంలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన తర్వాత కూడా చర్చల్లో నిలుస్తుంటాయి.

ఇప్పుడు అలాంటి ఒక మలయాళ చిత్రం డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలై దాదాపు మూడున్నర నెలలు గడిచిన తర్వాత బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన 'స్పా' ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రావడంతో సినిమా అభిమానులు చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా, ఒక మసాజ్ థెరపీ సెంటర్ చుట్టూ తిరిగే ఈ చిత్రం కామిడీ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది.

మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్

కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలతో మాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లో మంచి వ్యూయర్‌షిప్ సాధిస్తున్నాయి. అదే జాబితాలో ఇప్పుడు 'స్పా' (Spa) కూడా చేరింది. 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల సమయంలో కమర్షియల్ గా విజయాన్ని అందుకోకపోయినా, కథా నేపథ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఐఎమ్‌డీబీలో 6.3 రేటింగ్ దక్కించుకోవడం కూడా దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వినీత్ తట్టిల్ డేవిడ్, సిద్ధార్థ్ భరతన్, శ్రుతి మీనన్, రాధిక రాధాకృష్ణన్, శ్రీజ దాస్, ప్రశాంత్ అలెగ్జాండర్, మేజర్ రవి వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు ఇందులో. ఎబ్రిడ్ షైన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 28 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు భిన్నంగా ఉండే మలయాళ సినిమాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ వీకెండ్‌లో 'స్పా' ఒక ఆసక్తికరమైన సినిమాగా చెప్పుకోవచ్చు.

‘స్పా’ సినిమా కథ

కథ మొత్తం కొచ్చిలోని 'లా ప్యారడైజ్' అనే మసాజ్ సెంటర్‌లో కేవలం ఒకే ఒక్క రోజులో జరుగుతుంది. సమాజంలో మసాజ్ సెంటర్లపై ఉన్న అపోహలను, వాటి వెనుక ఉన్న వ్యవహారాలను ఈ సినిమా సెటైరికల్ గా చూపిస్తుంది. ఒక డాక్టర్, ఒక బిజినెస్‌మెన్, చివరికి ఒక సినిమా స్టార్ ఇలా రకరకాల మనస్తత్వాలు ఉన్న మగవాళ్లు శారీరక సుఖం కోసమో, విశ్రాంతి కోసమో ఆ స్పాకి వస్తుంటారు. అక్కడ పనిచేసే మహిళా థెరపిస్ట్‌లు.. వింత కోరికలతో వచ్చే కస్టమర్లను, డబ్బులు ఇచ్చాం కదా అని హద్దులు మీరే మనుషులను ఎలా హ్యాండిల్ చేశారనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.

ఇలాంటి వేర్వేరు కస్టమర్ల కథల మధ్యలోనే మాథన్, రియా అనే ఇద్దరి మధ్య ఒక సున్నితమైన ప్రేమకథ కూడా సాగుతుంది. స్పాలో దొరికే క్షణికమైన సుఖాన్ని నిజమైన ప్రేమగా అనుకునే మాథన్ అనే వ్యక్తికి, అక్కడ థెరపిస్ట్‌గా పనిచేసే రియాకి మధ్య అనుకోకుండా ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. సినిమా అంతా రకరకాల మనుషుల ప్రవర్తనలతో సాదాసీదాగా సాగిపోతున్నట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో మాత్రం కథ ఊహించని మలుపు తిరుగుతుంది. హఠాత్తుగా గన్ ఫైట్‌తో ఒక పెద్ద యాక్షన్ సీన్ రావడంతో సినిమా చాలా విచిత్రంగా ముగుస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu