Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!

రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!

NTV Telugu 1 week ago

Itel Aqua Launch: బడ్జెట్ మొబైల్ ఫోన్ల తయారీలో పేరుగాంచిన ఐటెల్ (itel) భారత మార్కెట్లో కొత్త ఫీచర్ ఫోన్ ఐటెల్ ఆక్వా (Itel Aqua)ను విడుదల చేసింది.

కొత్తగా పరిచయం చేసిన ఇన్నో (Inno) సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్, USB టైప్-C ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

ఇందులో 2.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా స్పష్టంగా కనిపించేలా మెరుగైన బ్రైట్‌నెస్‌ను అందించారు. ఫోన్‌లో ప్రాసెసర్, ర్యామ్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే మెమరీ కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజ్ విస్తరించుకునే అవకాశం ఉంది. అలాగే 1,000 కాంటాక్టులను సేవ్ చేసుకునే సామర్థ్యం, 250 SMS లు నిల్వ చేసుకునే సౌకర్యం, 60 కాల్ లాగ్‌లను భద్రపరచుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ ఫీచర్ ఫోన్‌లో VGA రియర్ కెమెరాను అందించారు. కాల్స్ సమయంలో చుట్టుపక్కల ఉండే శబ్దాన్ని తగ్గించేందుకు AI ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్‌ను జోడించారు. దీంతో మాట్లాడే వ్యక్తి వాయిస్ మరింత స్పష్టంగా వినిపిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 'కింగ్ వాయిస్' అనే ద్విభాషా వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో మెనూ సూచనలు, కాల్ సమాచారం, నోటిఫికేషన్లను వాయిస్ ద్వారా తెలియజేస్తుంది.

వీటితోపాటు తెలుగు సహా మొత్తం 10 భారతీయ భాషలకు మద్దతు ఉంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, పంజాబీ, కన్నడ, మలయాళం భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్, వైర్‌లెస్ FM రేడియో, FM రికార్డింగ్ ఫీచర్‌లను అందించారు. బ్లూటూత్ ద్వారా ఫైళ్లను వైర్‌లెస్‌గా షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్‌లో 1,200mAh బ్యాటరీని అమర్చారు. USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. వీటితోపాటు సూపర్ బ్యాటరీ మోడ్, స్పీడ్ డయల్, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్, ఫోన్‌బుక్ రీడింగ్, టైమ్ అప్‌డేట్, కస్టమైజేషన్ వంటి పలు ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఐటెల్ ఆక్వా ఫోన్‌కు IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించింది. దీంతో వర్షం, నీటి చినుకులు, మట్టి, దుమ్ము వంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ సురక్షితంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రమాదవశాత్తు పడిపోవడం లేదా కఠిన పరిస్థితుల్లో ఉపయోగించినా తట్టుకునేలా దీన్ని రూపొందించినట్లు పేర్కొంది. భారత మార్కెట్లో ఏ ఫీచర్ ఫోన్ ధర రూ.1,799గా నిర్ణయించారు. ఇది బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu