మెగా హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, నేడు సాయితేజ్‌ని అల్లు అర్జున్ పరామర్శించారు.
ఈ నెల 10న తన స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్‌తేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రగాయాలవగా, ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేశామని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

