Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..

Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..

NTV Telugu 1 week ago

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. స్క్రీన్‌పై ఆయన ఎంత రఫ్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తారో.. నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్ హార్డెడ్ గా ఉంటారు.

ఇందులో భాగంగా బీయింగ్ హ్యూమన్ (Being Human) ఫౌండేషన్ ద్వారా నిరంతరం ఎంతోమంది నిరుపేదలకు, చిన్నారులకు సహాయం చేసే సల్మాన్.. తాజాగా ఒక స్కూల్ పిల్లల కోసం చేసిన భారీ విరాళం, దానికి బదులుగా ఆ పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.

వెనుకబడిన ప్రాంతానికి చెందిన కొందరు పాఠశాల విద్యార్థుల చదువు కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.15 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సాయంతో ఆ స్కూల్‌లో మౌలిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చిన చిన్నారులు ఆయనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా చేతులతో తయారు చేసిన ఒక అందమైన గిఫ్ట్ సల్మాన్ ఖాన్‌కు బహుమతిగా అందించారు.

కోట్లాది రూపాయల విలువై న బహుమతులను సైతం సాధారణంగా తీసుకునే భాయ్‌జాన్.. ఆ చిన్నారులు ఎంతో అమాయకంగా, ప్యూర్ లవ్‌తో ఇచ్చిన ఆ చిన్న కానుకను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ గిఫ్ట్‌ను గుండెలకు హత్తుకుని, కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా పిల్లలను గట్టిగా కౌగిలించుకున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి ఒక మాస్ యాక్షన్ సూపర్‌స్టార్ పిల్లల నిస్వార్థమైన ప్రేమకు కరిగిపోయి ఏడ్చేసిన ఈ విజువల్స్ సోషల్ మీడియాలో అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి. “భాయ్‌జాన్ రియల్ హీరో” అంటూ ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu