Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..

Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..

NTV Telugu 4 days ago

90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను తన నృత్యాలతో, గ్లామర్‌తో ఒక ఊపు ఊపిన అగ్ర కథానాయికలలో కరిష్మా కపూర్ (Karisma Kapoor) ఒకరు. తెరపై ఎంతో ఎనర్జిటిక్‌గా, బబ్లీగా కనిపించే కరిష్మాకు సంబంధించిన ఒక సంచలన పాత వివాదం తాజాగా బాలీవుడ్ వర్గాల్లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

ఒక సినిమా షూటింగ్ సెట్‌లో లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (Saroj Khan) అసిస్టెంట్‌పై కరిష్మా కపూర్ తీవ్రస్థాయిలో అరుస్తూ చేసిన వివాదం అప్పట్లో ఇండస్ట్రీని ఏ విధంగా కుదిపేసిందో తెలిపింది.

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లు పడే కష్టాన్ని, వారి ఆత్మగౌరవాన్ని ఎల్లప్పుడూ గౌరవించే సరోజ్ ఖాన్.. కరిష్మా కపూర్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఒక నటిగా ఎంత స్టార్ హోదా ఉన్నా, తోటి కళాకారులను, టెక్నీషియన్లను తక్కువ చేసి మాట్లాడటం సంస్కారం కాదని సరోజ్ ఖాన్ సెట్ లోనే మండిపడ్డారు. దీంతో ఈ వివాదం తర్వాత భవిష్యత్తులో తాను కరిష్మా కపూర్‌తో కలిసి ఎప్పటికీ పనిచేయబోనని సరోజ్ ఖాన్ అక్కడికక్కడే శపథం చేశారు. సరోజ్ ఖాన్ అంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కరిష్మా చేసిన వ్యాఖ్యలు ఎంత ఘాటుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే బాలీవుడ్ మరో అగ్ర కథానాయిక మాధురీ దీక్షిత్ పేరు కూడా స్క్రీన్‌పైకి వచ్చింది. షూటింగ్ సెట్లలో మాధురీ దీక్షిత్ చూపించే క్రమశిక్షణ, తోటి డ్యాన్సర్ల పట్ల ఆమెకు ఉండే హుందాతనాన్ని గుర్తుచేస్తూ.. కరిష్మా కపూర్ ప్రవర్తనను మాధురితో పోల్చి చూశారు. దీని బట్టి సినిమా తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో ఇగోలు, ఘర్షణలు దాగి ఉంటాయనేది అర్ధమవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu