Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shah Rukh Khan: 'కింగ్' నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్‌తోనే సరికొత్త చరిత్ర!

Shah Rukh Khan: 'కింగ్' నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్‌తోనే సరికొత్త చరిత్ర!

NTV Telugu 1 week ago

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సంచలనం సృష్టిస్తున్నట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘కింగ్’ మ్యూజిక్ రైట్స్ విలువ దాదాపు రూ.50 కోట్లకు చేరువలో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ రైట్స్ కోసం ప్రముఖ మ్యూజిక్ సంస్థలు తీవ్ర పోటీ పడినట్లు సమాచారం. సోనీ మ్యూజిక్, సారిగామా, జీ మ్యూజిక్, టీ మ్యూజిక్ వంటి సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనడంతో డీల్ విలువ రికార్డు స్థాయికి చేరిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ డీల్ షారుక్ ఖాన్ గత చిత్రాలైన ‘పఠాన్’, ‘జవాన్’ మ్యూజిక్ రైట్స్ రికార్డులను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘పఠాన్’ మ్యూజిక్ రైట్స్ సుమారు రూ.30 కోట్లకు, ‘జవాన్’ ఆడియో హక్కులు రూ.36 కోట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పుడు ‘కింగ్’ ఆ రికార్డులను దాటి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సచిన్-జిగర్ సంగీతం అందిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను 2026 క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘కింగ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యూజిక్ రైట్స్ డీల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu