Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sharwanand : 'రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..' శర్వానంద్ వైరల్ కామెంట్స్!

Sharwanand : 'రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..' శర్వానంద్ వైరల్ కామెంట్స్!

NTV Telugu 1 month ago

Sharwanand : టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్‌లో ఒక ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్నారు వీరు.

తాజాగా ఈ సీనియర్ జంటపై యువ హీరో శర్వానంద్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శర్వానంద్ హీరోగా, రాజశేఖర్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా బైకర్. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న శర్వానంద్.. రాజశేఖర్ – జీవితల మధ్య ఉన్న బంధం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.

READ ALSO: PBKS vs CSK: టాప్ లేపిన పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై..!

“రాజశేఖర్ గారిని చూస్తుంటే అప్పుడప్పుడు నాకు చాలా జెలస్‌గా అనిపిస్తుంది. దానికి కారణం జీవిత గారు. ఆమె రాజశేఖర్ గారిని ఇప్పటికీ ఒక చిన్న బాబుని చూసుకున్నట్టు అంత అపురూపంగా చూసుకుంటారు. ఆయన ఆరోగ్య విషయంలో కానీ, ఇతర పనుల్లో కానీ ఆమె చూపే శ్రద్ధ, ప్రేమ నిజంగా గ్రేట్” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. వయసు పెరుగుతున్నా, ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా జీవిత గారు ఎప్పుడూ రాజశేఖర్ గారి వెంటే ఉంటూ ఆయనకు అండగా నిలబడటం మనం చూస్తూనే ఉంటాం, షూటింగ్ స్పాట్లలో కూడా ఆయన అవసరాలను ఆమె దగ్గరుండి చూసుకుంటారని శర్వానంద్ అన్నారు. శర్వానంద్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. “నిజమే.. రాజశేఖర్ గారికి – జీవిత గారి లాంటి భాగస్వామి దొరకడం చాలా అదృష్టం” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu