Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!

Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!

NTV Telugu 2 weeks ago

Siva Narayana Reddy: 'ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టాడు' అనే మాట పాతదైపోయింది. నేటి తరం ప్రేమ కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవడమే కాదు, భాగస్వామి కష్టాన్ని తీర్చే అద్భుతమైన ఆవిష్కరణగా మారుతోంది.

అందుకు నిదర్శనమే ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సరికొత్త ప్రేమకథ. భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక, ఒక భర్త తన సృజనాత్మకతకు పదును పెట్టి ఏకంగా ఆమె కోసమే ఒక ప్రత్యేకమైన ఎస్కలేటర్‌ను డిజైన్ చేసి వైరల్‌గా మారారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్తి శివనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈ తన భార్య కోసం ఒక అపూర్వ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.

ఆయన భార్య గత కొంతకాలంగా మోకాళ్ల నొప్పులు సమస్యల వల్ల ఇంట్లోని మెట్లు ఎక్కడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండేవారు. రోజురోజుకూ ఆమె పడుతున్న బాధను చూసి శివనారాయణ రెడ్డి మనసు చలించిపోయింది. ఆమె కష్టాన్ని ఎలాగైనా దూరం చేయాలనుకున్నారు. మార్కెట్లో దొరికే సాధారణ లిఫ్ట్‌లు లేదా కమర్షియల్ ఎస్కలేటర్లు కాకుండా, తన ఇంటి వసతులకు అనుగుణంగా ఉండేలా ఒక కస్టమ్ ఎస్కలేటర్‌ను స్వయంగా రూపొందించాలని నిశ్చయించుకున్నారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, భార్యపై ఉన్న అమితమైన ప్రేమను పెట్టుబడిగా పెట్టి, కేవలం ఆమె కోసమే ప్రత్యేకమైన మెకానిజంతో కూడిన ఎస్కలేటర్‌ను సక్సెస్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆమె ఎటువంటి శ్రమ లేకుండా, నొప్పుల బాధ లేకుండా సులభంగాపై అంతస్తుకు చేరుకోగలుగుతున్నారు. తన భార్యపై ఆ భర్త చూపించిన ఈ అపురూపమైన అనురాగం, ఆయన చేసిన సంచలన ఆవిష్కరణకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ భర్త ఐడియాను, ఆయన ప్రేమను నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu