Software Engineer Suicide: హైదరాబాద్‌లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు సీతారాం భార్య రేణుకతో పాటు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణ రెడ్డి, శ్రవణ్‌ను అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన అనంతరం వెలుగులోకి వచ్చిన 19 పేజీల సూసైడ్ నోట్‌లో అతను తన భార్య రేణుక ప్రవర్తనను ప్రధాన కారణంగా పేర్కొన్నాడు. తన భార్యకు అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో వివరించాడు.
సీతారాం తన సూసైడ్ నోట్‌లో రేణుకకు ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం కొనసాగిందని, వారి వల్ల తన వ్యక్తిగత జీవితం తీవ్రంగా దెబ్బతిన్నదని రాశాడు. ముఖ్యంగా రమణ రెడ్డితో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం తనను మానసికంగా కుంగదీసిందని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై ప్రశ్నించగా గతంలో రేణుక, రమణ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా నోట్‌లో పేర్కొన్నాడు. తాను ఎంత నచ్చజెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదని, పరిస్థితులు మరింత దిగజారాయని తెలిపాడు.

