Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం

Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం

NTV Telugu 1 week ago

ధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మేఘాలయ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.

సోమవారం జరిగిన విచారణ సందర్భంగా, మేఘాలయ ప్రభుత్వ తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోనమ్‌తో పాటు ఇతర నిందితులను అరెస్టు చేయడానికి దారితీసిన సాక్ష్యాధారాలను కోర్టు ముందు వివరించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం వాదించింది.

ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జూన్ 3న జరగనుంది. ఆ సందర్భంగా సోనమ్ తరఫు న్యాయవాది బెయిల్ కొనసాగింపుపై తన వాదనలు వినిపించనున్నారు. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ షిల్లాంగ్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను మేఘాలయ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అనంతరం సోనమ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ప్రస్తుతం సోనమ్ బెయిల్ షరతుల మేరకు షిల్లాంగ్‌లోనే నివసిస్తోంది. మరోవైపు, రాజ్, మిగతా ముగ్గురు సహ నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారు. సోనమ్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ మేఘాలయ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu