Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!

Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!

NTV Telugu 4 hrs ago

Sreeleela: టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగి, అంతే వేగంగా ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయిన యంగ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. తెలుగులో వరుస డిజాస్టర్లు పలకరించడంతో మేకర్స్ ఆమెను క్రమంగా పక్కన పెట్టేశారు.

గత రెండేళ్లుగా టాలీవుడ్‌లో ఒక్క ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేక ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తెలుగు ఇండస్ట్రీ ఆమెను పట్టించుకోకపోతేనేం.. పక్కనే ఉన్న కోలీవుడ్ మాత్రం శ్రీలీలకు రెడ్ కార్పెట్ పరిచింది. అక్కడ ఆమె సంపాదిస్తున్న క్రేజ్, అందుకుంటున్న ఆఫర్లు చూసి టాలీవుడ్ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి.

‘పెళ్లి సందD’, ‘ధమాకా’ విజయాల తర్వాత శ్రీలీలకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అయితే ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం ఫాస్ట్ డ్యాన్సులకే పరిమితమై, నటనకు ప్రాధాన్యం లేని రొటీన్ కమర్షియల్ రోల్స్ చేయడంతో ప్రేక్షకులకూ మొహం మొత్తింది. ‘గుంటూరు కారం’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడటంతో ఆమెపై నెగిటివ్ ముద్ర పడింది. కొత్త ఆఫర్లు రాక తెలుగులో దాదాపు ఫేడవుట్ అయిపోయింది. తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన డెబ్యూ మూవీ ‘పరాశక్తి’ పెద్దగా ఆడకపోయినా, కోలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం శ్రీలీల టాలెంట్‌పై గట్టి నమ్మకం ఉంచారు. ప్రస్తుతం అక్కడ సూపర్ స్టార్ల సినిమాల్లో ఆమె పేరే ఫస్ట్ ఛాయిస్‌గా మారుతోంది.

ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓం’లో సాయి పల్లవితో పాటు శ్రీలీల నటిస్తోంది. ఇందులో ఎప్పుడూ చూడని విధంగా ఒక మిడిల్ క్లాస్ హౌస్‌వైఫ్ పాత్రలో పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించనుంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్న రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో ఇప్పటికే నయనతార, సిమ్రాన్, రాశీ ఖన్నా ఉన్నప్పటికీ.. శ్రీలీల కోసం ప్రత్యేక పాత్రను కేటాయించి ఆమె జాయిన్ అయినట్లు అఫీషియల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అజిత్ 64వ సినిమా ‘డేర్ డెవిల్’ నుంచి శ్రీలీలను తప్పించారంటూ గతంలో వచ్చిన రూమర్లకు తాజాగా ఫుల్‌స్టాప్ పడింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ భార్య శాలిని సొంత బ్యానర్ ‘బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్’పై నిర్మిస్తున్న ఈ భారీ మూవీ లాంచింగ్‌లో శ్రీలీల ప్రత్యక్షమైంది. దీంతో ఇందులో మెయిన్ లీడ్‌గా శ్రీలీలనే ఖరారైనట్లు స్పష్టమైంది. ఒక ఇండస్ట్రీ దూరం పెట్టినా ఏమాత్రం తగ్గకుండా.. పక్కనే ఉన్న కోలీవుడ్‌లో రజినీ, అజిత్, ధనుష్ వంటి టాప్ స్టార్ల సినిమాలతో డేట్స్ దొరకనంత బిజీగా మారి అందరికీ గట్టి షాకిచ్చింది శ్రీలీల. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న విభిన్న పాత్రలతో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలేందుకు ఆమె గట్టిగానే సిద్ధమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu