Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను

Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను

NTV Telugu 2 hrs ago

కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 'విశ్వనాథ్ & సన్స్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు.

20 ఏళ్ల క్రితం 'గజినీ' సినిమాలో సంజయ్ రామస్వామిగా నన్ను ఎలాగైతే ఆదరించారో, సరిగ్గా అలాంటి వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ తీసుకురావాలనే లక్ష్యంతోనే దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ఈ కథను రూపుదిద్దారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే గడిపిన ఆరు నెలల కాలాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని సూర్య పేర్కొన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి సిన్సియారిటీని, ఆయన రైటింగ్ స్కిల్స్‌ను సూర్య ఆకాశానికెత్తేశారు. వెంకీతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందని చెప్పారు. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రానికి ఎలాంటి ప్రేమనైతే అందించారో, ఆగస్టు 14న రాబోతున్న 'విశ్వనాథ్ & సన్స్' సినిమాకు కూడా అదే స్థాయి ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నట్లు సూర్య తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu