Dailyhunt
Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?

Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?

NTV Telugu 1 week ago

కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్.. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. సీనియర్ నాయకులతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ అందజేశారు. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతును విజయ్ ఇంకా నిరూపించుకోలేకపోయారని లోక్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరారని.. బలపరీక్షలో మెజారిటీ సాధిస్తామన్న విజయ్ వాదనతో గవర్నర్ సంతృప్తిగా లేరని వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ప్రమాణస్వీకారం ఉండకపోవచ్చని తెలిపాయి. దీంతో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.

ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖనే విజయ్ అందజేశారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ విజయ్‌ దగ్గర ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ మాత్రమే సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మిగతా చిన్న పార్టీలు కూడా మద్దదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అప్పటి వరకు ప్రమాణస్వీకారం ఉండకపోవచ్చని తెలుస్తోంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశాకే.. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గవర్నర్‌తో సమావేశంలో విజయ్‌తో పాటు బస్సీ ఆనంద్, సెంగోట్టయ్యన్, అధవ్ అర్జున్, అరుణ్ రాజ్ సహా టీవీకే సీనియర్ నాయకులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu