Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TATA Aeris: టాటా నుంచి ఏరిస్‌ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..

TATA Aeris: టాటా నుంచి ఏరిస్‌ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..

NTV Telugu 1 day ago

టాటా మోటార్స్ తన సబ్-ఫోర్-మీటర్ సెడాన్ విభాగంలో టిగోర్ ఫేస్‌లిఫ్ట్ స్థానంలో సరికొత్త 'ఏరిస్' (Aeris) కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.

5.29 లక్షలుగా నిర్ణయించారు. డిజైన్ పరంగా ఈ కారు ముందు భాగం సరిగ్గా టియాగో మోడల్‌ను పోలి ఉంటుంది. అయితే బంపర్పై తక్కువ బ్లాక్ క్లాడింగ్ ఇవ్వబడింది. ఇంకా ఇందులో బ్లాక్ చేయబడిన ఓఆర్‌విఎంలు, టర్న్ ఇండికేటర్లు, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ సెటప్‌లా కనిపించే వెనుక టెయిల్-లైట్ గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ కారు డండేలి డ్రిజిల్ (లావెండర్), నైట్రో క్రిమ్సన్ (రెడ్), డ్యూన్ గ్లో (సాండ్), డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ప్రిస్టిన్ వైట్ అనే ఆరు ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. లలిత్‌పూర్ గ్రే క్యాబిన్ థీమ్ అండ్ డ్యూయల్-టోన్ సీట్లతో దీనిని తీర్చిదిద్దారు. స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డ్ లేఅవుట్, సెంటర్ కన్సోల్ అన్నీ సరిగ్గా టియాగో మాదిరిగానే ఉంటాయి. ఇందులో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ వైర్‌లెస్ ఛార్జర్, వెనుక ఏసీ వెంట్లు, ఆటోమేటిక్ వేరియంట్ల కోసం రోటరీ డ్రైవ్ సెలెక్టర్, డాష్‌కామ్‌తో కూడిన 360 డిగ్రీల కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ పనితీరు పరంగా టాటా ఏరిస్ 1.2-లీటర్ పెట్రోల్ మోటార్‌తో వస్తుంది. ఇది 85bhp శక్తిని, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీనిలో ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో కూడిన ఐ-సిఎన్జి (i-CNG) వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది 74.5bhp శక్తిని , 96.5Nm టార్క్‌ను ఇస్తుంది. పెట్రోల్ అండక సీఎన్జీ రెండూ కూడా 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో వస్తాయి. ఈ కారు బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభం కాగా.. అక్టోబర్ 11 నుంచి డెలివరీలు అందించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu