Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG EAPCET 2026: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా

TG EAPCET 2026: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా

NTV Telugu 1 week ago

TG EAPCET 2026: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి ఫలితాలు విడుదల చేశారు.

మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్​, ఫార్మసీ పరీక్షలు నిర్వహించగా, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 9 నుంచి 11 వరకు జరిగాయి. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. 1,97, 241 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షను రాయగా.. 84,954 మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ రాశారు. ఫలితాల విషయానికి వస్తే..ఇంజనీరింగ్‌లో 14,4704 మంది అంటే 73.36% ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే 0.1% ఉత్తీర్ణత పెరిగింది. ఉప్పల్‌కి చెందిన M. రుషి అనే అమ్మాయి 156.63 మార్కులతో ఇంజనీరింగ్ టాపర్‌గా నిలిచింది. రెండో ర్యాంకర్ హైదరాబాద్ ముసాపేట్‌కి చెందిన యువకుడు బెజుగామ అన్షుల్ (148.70మార్క్స్), మూడో ర్యాంకర్‌గా ఏపీలోని కడపకు చెందిన M. వంశీధర్‌రెడ్డి (147 మార్క్స్) నిలిచారు.

TG EAPCET - 2026 అగ్రికల్చర్ & ఫార్మసీ (A&P) విభాగం టాపర్స్ వివరాలు:
ర్యాంక్ 1 : ముక్కరం అహ్మద్ - 150.17 మార్కులు
ర్యాంక్ 2 : తాడూరి నివృత్త్ సాయి వెంకట్ - 143.43 మార్కులు
ర్యాంక్ 3 : సాహితి గీతిక గునిథి - 142.35 మార్కులు
ర్యాంక్ 4 : మయుక్ జయసింహ - 139.78 మార్కులు
ర్యాంక్ 5 : అమైర్ అనాస్ - 137.40 మార్కులు
ర్యాంక్ 6 : నాథన్ షెబా జెరూషా - 137.24 మార్కులు
ర్యాంక్ 7 : పెరికేటి అనురాగ్ - 136.67 మార్కులు
ర్యాంక్ 8 : బూర సాయి శరణ్ - 135.21 మార్కులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu