Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!

Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!

NTV Telugu 1 week ago

Thursday Horoscope 2026 August 6: మేష రాశి వారు నూతన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. చేపట్టిన పనుల్లో తోటి ఉద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది.

నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధిస్తారు. వీరు శ్రీ వల్లభ గణపతి స్వామిని స్మరిస్తూ గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారికి శ్రమ, ప్రయాసలు పెరిగినప్పటికీ అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ధ్యానం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనుభవజ్ఞుల సలహాల మేరకు వ్యాపారాలను ప్రారంభించడం మంచిది. వీరు శ్రీ అమృతలింగేశ్వర స్వామిని ధ్యానిస్తూ శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

కర్కాటక రాశి వారికి రోజు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో పనులను చేపట్టి పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటారు. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన ప్రయోజనాలు పొందుతారు. శ్రీ కార్తివీర్యార్జున స్వామి వారి కవచాన్ని పారాయణం చేయడం శుభకరం. సింహ రాశి వారు వ్యాపార రంగంలో పోటీని తట్టుకుని నిలబడతారు. ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. తగిన విశ్రాంతి, సమయానుకూల ఆహారం అవసరం. ధైర్యంతో పనులను అధిగమిస్తారు. వీరు శ్రీ మార్తాండ భైరవ స్వామిని స్మరిస్తూ ఆదిత్య ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మేలు చేస్తుంది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu