Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!

Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!

NTV Telugu 3 weeks ago

రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం.

మిధున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. అప్పుల భారాల సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ విషయాల్లో అకారణమైన బేధాభిప్రాయములు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో స్థిమితముగా, మితముగా మాట్లాడుతూ అనుకున్న పనులు పూర్తి చేయాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి.

కర్కాటక రాశి వారికి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంప్రదింపులతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. కొన్ని పనులను మొండిగా వ్యవహరిస్తూ పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హరిద్ర గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu