Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు

Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు

NTV Telugu 5 days ago

మే 21వ తేదీ మాస్ పండగకు వేదిక కాబోతోంది. టాలీవుడ్ ఇద్దరు అగ్ర సీనియర్ స్టార్ హీరోలు అయిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తమ ప్రతిష్టాత్మక చిత్రాలను ఒకే రోజు అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు లాంచ్ అవుతుండటంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచంలో సరికొత్త జోష్ నెలకొంది.

వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న NBK112 ప్రాజెక్ట్ మే 21న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ‘పవర్ మీట్స్ పర్పస్’ మాస్ బికమ్స్ ఎ మూవ్‌మెంట్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ బాలయ్య రేంజ్ మాస్ ఎలిమెంట్స్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడంతో క్రేజ్ వేరే లెవల్ లో ఉంది.

మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ Mega158 కూడా మే 21నే ముహూర్తపు వేడుక నిర్వహించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ సాలిడ్ లుక్‌లోకి మారుతున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు సీనియర్ టాప్ స్టార్స్ ఒకే రోజు తమ కొత్త సినిమాలను ప్రారంభించడంతో ఈ రెండు సినిమాలు ఇప్పడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu