Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్

Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్

NTV Telugu 6 days ago

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య బాలీవుడ్ సినిమాల కోసమా టాలీవుడ్ ను పక్కన పెట్టిన శ్రీలీల అక్కడ బిజీ అవుతుందని అనుకున్నారు.

కాని అక్కడ కూడా ప్రస్తుతం సినిమాలేవి చేయడం లేదు. ఇంతకీ మ్యాటరెంటని ఆరా తీయగా శ్రీలీల సినిమాలేవీ చేయడం లేదట. సినిమాలకు సడెన్ బ్రేక్ ఇచ్చిందట. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో రోజుకు రెండు కాల్షీట్లు ఇస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వెండితెరకు కాస్త దూరంగా ఉండటం ట్రేడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆమెకు సినిమా ఆఫర్లు రాక ఖాళీగా ఉందా అంటే.. అస్సలు కాదు! కావాలనే ఆమె సినిమాలకు విరామం ప్రకటించినట్లు తెలిసింది.

వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో టాప్ స్పీడ్‌లో దూసుకుపోతున్న శ్రీలీల ఇలా గ్యాప్ తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆమెకు అవకాశాలు తగ్గడం వల్ల ఈ గ్యాప్ రాలేదని శ్రీలీల తన చదువుపై దృష్టి పెట్టడం కోసమే ఈ విరామం తీసుకుందట. డాక్టర్ కోర్స్ చదువుతున్న శ్రీలీల అప్పట్లో గుంటూరు కారం సినిమా కోసం ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంది. కానీ ఇప్పడు ప్రొఫెషనల్ యాక్టర్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఎడ్యుకేషన్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఆమె సినిమాలను కాస్త పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సరికొత్త ప్రాజెక్ట్‌లతో ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu